ETV Bharat / state

NIRANJAN REDDY: కాంగ్రెస్​ పార్టీని పాలమూరు ప్రజలు తిరస్కరించారు: నిరంజన్​ రెడ్డి - telangana varthalu

సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని పాలమూరు ప్రజలు తిరస్కరించారని ఆయన ఆరోపించారు. 2014కు ముందు లక్ష ఎకరాలకు మించి నీరందించారా అని కాంగ్రెస్​ నేతలను ప్రశ్నించారు. 80వేల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ వెల్లడించారు. ఏటా ఉద్యోగాలపై సీఎం క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారని తెలిపారు.

NIRANJAN REDDY: కాంగ్రెస్​ పార్టీని పాలమూరు ప్రజలు తిరస్కరించారు: మంత్రి నిరంజన్​ రెడ్డి

author img

By

Published : Oct 13, 2021, 5:30 PM IST

కాంగ్రెస్‌ పార్టీని పాలమూరు ప్రజలు తిరస్కరించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులు కట్టలేదని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరులో 30లక్షల ఎకరాల సాగు భూమి ఉందన్న మంత్రి.. 2014కు ముందు లక్ష ఎకరాలకు మించి నీరందించారా అని కాంగ్రెస్​ నేతలను ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నేతలకు పాలమూరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 60ఏళ్లు అధికారంలో ఉన్న హస్తం పార్టీ ఏ మేరకు నీరందించారో చెప్పాలన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తయినా నీళ్లు నింపలేదని ఆయన విమర్శించారు. కర్ణాటకకు రూ.70 కోట్ల పరిహారం కట్టాల్సి వస్తుందని నీళ్లు నింపడం ఆపారని పేర్కొన్నారు. గతంలో జూరాల, ఆర్డీఎస్‌ ద్వారా లక్ష ఎకరాలకే సాగునీరు అందించారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే చాలా ప్రాజెక్టులు వచ్చాయని మంత్రి తెలిపారు. దసరా అనంతరం ఓ బస్సు ఏర్పాటు చేస్తామని.. ప్రాజెక్టులను సందర్శించి నీటి లభ్యతను చూడాలని కాంగ్రెస్​ నేతలకు సూచించారు. తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ కారణంగానే పాలమూరు జిల్లా నాశనం అయ్యిందని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తెరాసపై అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు.

నీచ రాజకీయాలు చేస్తున్నరు..

శ్రీకాంతా చారి ఫొటో పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. శ్రీకాంతా చారి మా బిడ్డ కాదా అంటూ ప్రశ్నించారు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కను మొత్తం బయటపెట్టామని మంత్రి వెల్లడించారు. కేంద్రం వ్యవసాయంపై ఎన్నో నిర్ణయాలు తీసుకుందని.. వాటిపై కాంగ్రెస్​ నేతలు ఎందుకు మాట్లాడరని ధ్వజమెత్తారు. 80 శాతం పూర్తి అయిన పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేసి నీళ్లందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పాలమూరు వెనుకబాటుతనానికి పురుడుబోసింది.. పునాది కట్టింది.. కాంగ్రెస్​ పార్టీనే. ఉమ్మడి పాలమూరు జిల్లా 30లక్షల పైచిలుకు సాగు భూమి ఉంది. వారి 60 ఏళ్ల పాలనలో పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు మించి నీళ్లు ఎక్కడైనా పారినాయా?. పాలమూరు గురించి, పాలమూరు నీటి వసతుల గురించి, పాలమూరు వ్యవసాయం గురించి, పాలమూరు బతుకుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదు వాళ్లకు. -సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారు..

కాంగ్రెస్​ నాయకులు పాలమూరు గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ధ్వజమెత్తారు. వాళ్ల హయాంలోనే పాలమూరు వలసల జిల్లా, కూలీల జిల్లాగా పేరు పొందిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాకే మంచి పేరొచ్చిందన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్​, భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ మాదిరిగా ఏ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరిగాయని మంత్రి ప్రశ్నించారు. దీనిపై చర్చకు సిద్ధమని సవాల్​ విసిరారు. 80వేల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. ఏటా ఉద్యోగాలపై క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినా కోర్టుల్లో కేసులు పెట్టి నిలిపివేస్తారని ఆయన మండిపడ్డారు.

ఉద్యోగాలు కల్పిస్తాం..

మహారాష్ట్రలోని పలు గ్రామాలు తెలంగాణలో కలపాలని కోరుతున్నాయని.. అంతగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రైవేటు రంగంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రైవేటు రంగంలో పాలసీ తేవాలనేది ప్రభుత్వ యోచన అని ఆయన పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు అనేక కంపెనీలు వచ్చాయన్నారు. తెరాస వచ్చిందే.. 'నీళ్లు, నిధులు, నియమకాలు' అనే నినాదంతో అని ఆయన వెల్లడించారు. వందశాతం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని.. అది తెరాసతోనే సాధ్యమని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ స్పష్టం చేశారు. కాంగ్రెస్​ ఎన్ని జంగ్​ సైరన్​లు మోగించినా నిరుద్యోగులు తెరాస వైపే ఉంటారన్నారు.

ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణ మాదిరిగా రిక్రూట్​మెంట్​ జరిగిందని చెప్పండి.. దానిపై మేము చర్చకు సిద్ధం. పదేళ్లు పాలించి పదివేల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏడేళ్ల పాలనలోనే లక్షా 52వేల ఉద్యోగాల నోటిఫికేషన్​ ఇచ్చి.. అందులో లక్షా 33వేల మందిని భర్తీ చేయడం జరిగింది. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్​ 80 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. -శ్రీనివాస్​ గౌడ్​, రాష్ట్ర మంత్రి

కాంగ్రెస్​ పార్టీని పాలమూరు ప్రజలు తిరస్కరించారు: మంత్రి నిరంజన్​ రెడ్డి

ఇదీ చదవండి: KTR: తెరాస అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్.. కేటీఆర్ ఏమన్నారంటే...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.