ఆరేళ్లలోనే మహబూబ్‌నగర్ జిల్లా చాలా అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పాలమూరు ప్రభుత్వ వైద్యశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఈటలతో కలిసి ఆయన పాల్గొన్నారు. గతంలో ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లేవారని... ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పెద్ద ఆస్పత్రి నిర్మించుకోవడం సంతోషకరమన్నారు.
ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరు చేశారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దాదాపు 200 మంది వైద్య సిబ్బందితో ప్రజలకు వైద్య సేవలు అందుతాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా.. ఒక్కరోజే 2 లక్షల కేసులు