ETV Bharat / state

కొవిడ్​పై అపోహలొద్దు... వైద్యరంగంలో మూడోస్థానంలో ఉన్నాం: ఈటల - ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రులు

ఒకప్పుడు కరవు కాటకాలు, వలసలతో తల్లడిల్లిన మహబూబ్‌నగర్‌ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషితోనే అభివృద్ధిబాటలో సాగుతోందని మంత్రి ఈటల అన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఈటల పాల్గొన్నారు.

government medical college in mahabubnagar
'ముఖ్యమంత్రి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది'
author img

By

Published : Jul 13, 2020, 2:49 PM IST

Updated : Jul 13, 2020, 3:30 PM IST

కరవు, వలసలతో సతమతమైన రాష్ట్రం ముఖ్యమంత్రి కృషితో నేడు దేశానికే ధాన్యాగారంగా మారిందని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. పాలమూరు ప్రభుత్వ వైద్యాశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్​, శ్రీనివాస్​గౌడ్​, ఈటల పాల్గొన్నారు. వైద్యరంగంలోను రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్తుందని మంత్రి ఈటల పేర్కొన్నారు. వైద్యరంగంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. ప్రారంభంలో కొంత భయపడినప్పటికీ కొవిడ్​ను సమర్థవంతంగానే ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మనదేశంలో పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు.

ఆరేళ్లలోనే మహబూబ్‌నగర్‌ జిల్లా చాలా అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. గతంలో ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లేవారని... ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పెద్ద ఆస్పత్రి నిర్మించుకోవడం సంతోషమన్నారు.

'ముఖ్యమంత్రి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది'

ఇదీ చూడండి: వైద్య వ్యవస్థపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉంది: కేటీఆర్​

Last Updated : Jul 13, 2020, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.