ETV Bharat / state

దసరా ప్రత్యేక పూజల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

author img

By

Published : Oct 26, 2020, 5:03 AM IST

విజయదశమిని పురస్కరించుకుని రాష్ట్ర ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

minister srinivasa goud is in dasara festival
దసరా ప్రత్యేక పూజల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

దసరా పండుగ సందర్భంగా మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో రాష్ట్ర ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలను పీడీస్తున్న కరోనా అంతం కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మణవాడలోని ఆర్య సమాజ్‌ మందిరంలో హోమం, పూజ కార్యక్రమాలలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. రాంమందిర్‌ కూడలిలో నిర్వహించిన శమీపూజలో పాల్గొని ధ్వజావిష్కరణ చేశారు. పట్టణ పురపాలక పరిధిలోని పాలకొండ గ్రామంలో బతుకమ్మ చీరలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.