ETV Bharat / state

'రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం' - minister srinivas reddy visited in devarakadra

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియంత్రిత వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై.. రైతులకు పలు సూచనలు చేశారు. రైతులతో ప్రతిజ్ఞ చేపించారు.

minister srinivas reddy visited in devarakadra
'రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ద్యేయం'
author img

By

Published : May 27, 2020, 12:59 PM IST

రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎక్సైజ్​ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియంత్రిత వ్యవసాయ విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి.. అర్హులందరికీ అందేలా చూస్తున్నామన్నారు.

వ్యవసాయ రంగంలో నవీన పద్ధతులతో పాటు యాంత్రీకరణ వ్యవసాయ విధానాలనుపయోగించి అధిక దిగుబడి వచ్చే పంటలను పండిచ్చేలా ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నియంత్రిత వ్యవసాయ విధానానికి రైతులందరూ ముక్తకంఠంతో మద్దతు తెలపాలని సూచించారు. అనంతరం రైతులతో ప్రతిజ్ఞ చేయించారు.

అంతకుముందు పెద్ద రాజమూర్​లో రూ.6.69 కోట్లతో చేపట్టనున్న చెక్​డ్యాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. జిల్లాలో ఎంపికైన నలుగురు వ్యవసాయ విస్తరణ అధికారులకు నియామక పత్రాలను అందజేశారు.

minister srinivas reddy visited in devarakadra
'రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ద్యేయం'

ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.