కరోనా సంక్షోభ సమయంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మహబూబ్నగర్ జిల్లాలో రూ. 1999 సిటీ స్కానింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొవిడ్ పరిస్థితులపై జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
కొవిడ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులల్లో రెమ్డిసివిర్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయా ఆసుపత్రులలో వాటిని ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఆదేశించామని పేర్కొన్నారు. జిల్లాలోని 13 ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రుల్లో 20 శాతం బెడ్లను నిర్ణీత రుసుముతో పేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఆదేశాలను పాటించని ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రభుత్వంతో పాటు, ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రోజూ లక్ష పరీక్షలు చేయాలని ఎన్నిసార్లు ఆదేశించినా పట్టించుకోరా..?