మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో అధునాతన వసతులతో మరో 600 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సుమారు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో తల్లి శాంతమ్మ, సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌తో కలిసి ఆయన కొవిడ్ టీకా వేయించుకున్నారు.
45ఏళ్లు పైబడిన వాళ్లంతా టీకా వేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకూ 40వేల మందికి టీకా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో మరో 9వేల డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. టీకా వేయించుకున్నా... జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించాలన్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు రెండూ బాగానే పనిచేస్తున్నాయని తెలిపారు.
ఇదీ చూడండి: 'గాంధీలో కరోనా చికిత్సతో పాటు సాధారణ వైద్య సేవలు యధాతథం'