వైన్ షాపుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం అనే భారతదేశంలోనే చరిత్రాత్మక నిర్ణయం అని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Srinivas goud comments) అన్నారు. మద్యం దుకాణాల కేటాయింపులోనూ రిజర్వేషన్లు(Liquor reservation in telangana) కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా మద్యం దుకాణాల రిజర్వేషన్ల కేటాయింపు లాటరీ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల్లో కింది విధంగా కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.
- గౌడ కులస్థులకు 15 శాతం రిజర్వేషన్ల ప్రకారం- 363 దుకాణాలు
- ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్ల ప్రకారం- 262 దుకాణాలు
- ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకారం- 131 దుకాణాలు
మొత్తం 756 మద్యం దుకాణాలు రిజర్వేషన్(Liquor reservation in telangana) కల్పించామని.. మిగతా 1,864 దుకాణాలకు ఓపెన్ కేటగిరీలో టెండర్లు నిర్వహిస్తామని మంత్రి(Srinivas goud comments) వివరించారు. నారాయణపేట, ములుగు ఇంకా ఎక్సైజ్ రెవెన్యూ జిల్లాలుగా మారలేదని.. ఆయా జిల్లాల్లో ఉమ్మడి ప్రాంతాల్లో టెండర్లు నిర్వహిస్తామని తెలిపారు. నామమాత్రంగా ఈసారి దుకాణాలు పెంచామన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. బర్రెలు, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, చేనేత రాయితీలు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకాలపై హర్షం వ్యక్తమైందన్నారు. అదే తరహాలో గౌడ కులస్థులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లపై బీసీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో గుడుంబా, గంజా, మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు మంత్రి(Srinivas goud comments) తెలిపారు. అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
వైన్ షాపుల్లో రిజర్వేషన్లు ఇవ్వడం అనేది భారతదేశంలోని ఒక చరిత్రాత్మక నిర్ణయం. చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయాలు అమలు చేయరు. జీవోలు ఇష్యూ అవుతాయి. కానీ అవి అమలుకావు. కానీ మొన్నటికి మొన్న దేశంలో ఎక్కడా లేనటువంటిది మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎస్సీ, ఎస్టీలకు కేవలం రిజర్వేషన్లు మాత్రమే అంటే ఆ ఉద్యోగాల ద్వారా జనాభాలో 2.5 శాతమే ఉద్యోగాలు ఉంటాయి. అందులో ఎంత రిజర్వేషన్ ఇచ్చినా ఏం బాగుపడతారు? ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పుడు చదువుకుంటారు. ఎడ్యుకేషన్, హెల్త్, సొసైటీలో గౌరవం అన్ని రకాలు అభివృద్ధి అవుతాయనే తలంపుతో కొత్తగా వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయం. గుడుంబాను ఉక్కుపాదంతో అణచివేస్తాం. అందుకు కఠినమైన చర్యలు చేపడుతున్నాం. పీడీ యాక్ట్ కింద జైళ్లో పెడతాం.
-శ్రీనివాస్ గౌడ్, ఆబ్కారీశాఖ మంత్రి
మార్గదర్శకాలు విడుదల
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది. కొత్త జిల్లాలను యూనిట్‌గా తీసుకొని కేటాయింపులు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఉన్న దుకాణాల ఆధారంగా ఈ కేటాయింపులు పూర్తి చేస్తారు.
ఇదీ చదవండి: వైన్స్ కేటాయింపులపై సర్కార్ మార్గదర్శకాలు.. కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు..