శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడుకు కృష్ణా జలాలు తరలించుకుపోతామంటే చూస్తూ ఊరుకోమని.. వందశాతం అడ్డుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్ తెరాస పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎత్తుకు పై ఎత్తు వేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే ఏ మాత్రం ఉపేక్షించబోమని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని.. ఎవరూ సీఎం కేసీఆర్ను, ప్రభుత్వ వైఖరిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పార్టీకి, కేసీఆర్కు ముఖ్యమని పునరుద్ఘాటించారు.
"కృష్ణా, గోదావరి జలాలు సముద్రంలో కలవకుండా.. రెండు రాష్ట్రాలు తిరిగి వినియోగించుకునేలా ఏపీతో కలిసి పనిచేయాలని భావించే తరుణంలో ఆ ప్రభుత్వ వైఖరి సరైంది కాదు. పక్క రాష్ట్రాలను ఒప్పించుకుని తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించాం. అదే సరైనా వైఖరి. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై, ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా భాజపా ఏం చేయగలదో ఆలోచించాలి. అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా, విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకునేలా చొరవ తీసుకోవాలి."
-శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి
ఇదీ చదవండి: పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన