వ్యాధుల బారిన పడకుండా పిల్లలకు ముందు జాగ్రత్త చర్యగా రోటా వైరస్ వ్యాక్సిన్ వేయాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. వ్యాధి వచ్చిన తర్వాత కాకుండా ముందుగా దానిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్‌తో కలిసి రోటా వైరస్ వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్‌ను ప్రజారోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 16 ఏళ్లలోపు వయసుగల పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి:- ఈడీ ముందుకు ఐశ్వర్య- పన్ను ఎగవేతపై ప్రశ్నల వర్షం