రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మాతృవియోగం(srinivas goud family) కలిగింది. మంత్రి తల్లి శాంతమ్మ గుండెపోటుతో హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి మరణించారు. ఆమె అంత్యక్రియలు మహబూబ్‌నగర్ పట్టణంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ సాయంత్రం జరుగుతాయని మంత్రి కుటుంబ సభ్యులు తెలిపారు.
సీఎం సంతాపం
శ్రీనివాస్‌గౌడ్ తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్(cm kcr news) సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తదితరులు సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలన్నారు.
ఏడాదిలోనే ఇద్దరూ..
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పితృవియోగం కలిగింది. మంత్రి తండ్రి నారాయణగౌడ్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందారు. ఒకే ఏడాదిలోనే మంత్రికి తల్లిదండ్రులిద్దరూ దూరమయ్యారు.
ఇదీ చదవండి: Huzurabad by election: నేడే హుజూరా‘వార్’.. రాత్రి 7 గంటల వరకు పోలింగ్