మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో ఓ పెళ్లికి వెళ్లాడు రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్. బంధువుల వివాహమే కావడం వల్ల అందరితో సరదాగా గడిపారు. అంతలోనే కొంతమంది యువకులు వచ్చి సెల్ఫీ కావాలని అడిగారు. మంత్రి కాదనలేక సరేన్నారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ... సెల్ఫీలిచ్చారు. ఆ తర్వాత చూసుకుంటే.. చేతికి కడియం లేదు. ఎంతో ఇష్టంగా ధరించే కడియం కనిపించకపోవడం వల్ల మంత్రి కాస్త నిరాశకు గురయ్యారు. ఈ విషయమై విచారణ జరపాల్సిందిగా స్థానిక పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది.
ఇవీ చూడండి: గోదావరి జలాల్ని 100 శాతం వాడాలి: కేసీఆర్