రాష్ట్రంలోనే గాంధీ, ఉస్మానియాలాంటి పెద్ద ఆసుపత్రుల తర్వాత ఆక్సిజన్ ప్లాంట్ మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా వార్డులో 270 పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్‌ను మంత్రి ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని హైదరాబాద్‌లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్య కళాశాలకు పీజీ సీట్లు మంజూరు కావడం సైతం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ అర్బన్ ఏకో పార్కులోని చెరువు, అప్పన్నపల్లి గొంగోస్ కుంట చెరువు, పోసాని కుంట చెరువులో జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలసి చేప పిల్లలను వదిలారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో జీసీపీ, క్లినికల్ ట్రయిల్స్‌పై ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలను రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. మున్సిపల్ పరిధిలోని 42వ వార్డు అంబేద్కర్ నగర్ వద్ద సీసీ రోడ్డు, మురికి కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఇదీ చూడండి: మేయర్లు, నగరపాలికల పరిధి ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష