ఇవీ చూడండి: 60మంది నేతలను బురిడీ కొట్టించిన కేటుగాడు
ఆటో డ్రైవర్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం - రవాణ శాఖ
13 మందిని బలిగొన్న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తపల్లి ప్రమాద ఘటన తర్వాత పోలీసు, సామర్థ్యానికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లే వాహనాలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌లో అలాంటి ఆటో డ్రైవర్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
సామర్థ్యానికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లే వాహనాలపై పోలీసు, రవాణా శాఖ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అలాంటి ఆటో డ్రైవర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పట్టణంలో పలు అభివృద్ధి పనుల తీరును కలెక్టర్ రొనాల్డ్ రోస్తో కలిసి పరిశీస్తుండగా.. సుమారు 17 మంది విద్యార్థులను ఎక్కించుకున్న ఆటో కనిపిచింది. వెంటనే ఆ ఆటోను ఆపి.. డ్రైవర్‌పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకోని ప్రమాదం జరిగితే.. ఆ విద్యార్ధుల పరిస్థితి ఏమిటని మందలించారు. మరోసారి ఇలాగే కనిపిస్తే కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 60మంది నేతలను బురిడీ కొట్టించిన కేటుగాడు
Intro:Body:Conclusion:
Last Updated : Aug 9, 2019, 11:55 AM IST