రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తండ్రి నారాయణగౌడ్ అంత్యక్రియలు ముగిశాయి. మంత్రి తండ్రి నారాయణ గౌడ్ మృతి పట్ల పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
అనంతరం పట్టణంలో అశేష జనవాహిని మధ్య నారాయణ గౌడ్ అంతిమయాత్ర కొనసాగింది. పాలకొండలోని మంత్రి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, జనార్దన్ రెడ్డి నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి ఎర్రబెల్లి పరామర్శ