పరస్పర సహకారంతో ఎదగాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిందే సహకార వ్యవస్థ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో సహకార సంఘాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. రుణాలు పొంది తిరిగి చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వడ్డీ వ్యాపారస్తుల వలయం నుంచి చిరు వ్యాపారులను విముక్తి చేసేందుకే పీఏసీఎస్‌ల ద్వారా అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు పాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యాలయాల్లో, సంబంధిత బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లను తెరవాలన్నారు. వారికి 60 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. రుణాలు తీసుకున్న వాళ్లు సకాలంలో చెల్లింపులు చేయాలని లబ్ధిదారులకు సూచించారు.