ప్రపంచంమంతా గర్వించదగ్గ సంస్కృతి మన దేశానిదని... అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానంలో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం పువ్వులతో దేవుడిని పూజిస్తే... ఆ పువ్వులను దైవంగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణదని మంత్రి శ్రీనివాస్ కొనియాడారు. ప్రకృతిని పూజించే సంస్కృతి భారతదేశం సొంతమన్నారు. తెలంగాణ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకు ప్రథమ ప్రాధాన్యత ఉందని అందుకే పువ్వులను బతుకమ్మ రూపంలో ఆరాధిస్తారన్నారు. దసరా ఉత్సావాల్లో భాగంగా పలువురు కళాకారులు చేసిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనంతరం ఏర్పాటు చేసిన బాణాసంచా కార్యక్రమం చూపరులను మంత్రముగ్ధుల్ని చేసింది. అంతకుముందు ఆర్యసమాజ్‌లో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి.. తూర్పు కమాన్ నుంచి జిల్లా పరిషత్ మైదానం వరకు వివిధ వేషధారణలతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: దేవరగట్టులో నెత్తురోడింది!