మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీ మేరకు షాద్‌నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తివుతుందని మంత్రి పేర్కొన్నారు. చాకిరి వ్యవస్థను, దోపిడీలను నివారించి అన్ని వర్గాల మంచి కోసం కృషి చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 40 తాటి చెట్లు కూల్చేసిన భూస్వామి