మహబూబ్‌నగర్, హన్వాడ, కోస్గీ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి 704 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ.. ఆదేశాలు జారీ చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి వాటాలో భాగంగా.. రహదారుల విస్తరణ, నూతన రహదారుల నిర్మాణం, కేంద్ర ఉపరితల రవాణా, హైవేల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
బూత్పూర్ నుంచి అమిస్తాపూర్, పాలమూరు యూనివర్సిటీ, వీరన్నపేట, చిందార్పల్లి, హన్వాడ, కోస్గీ మీదుగా దుద్యాల గేట్ వరకు ప్యాకేజీ-1లో భాగంగా 60.25 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారిని నిర్మించటానికి సాంకేతిక, పరిపాలన అనుమతులు విడుదల చేశారని తెలిపారు. ఈ రహదారి నిర్మాణ కోసం 704 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులను కేంద్రం జారీ చేసిందన్నారు. అలాగే ప్యాకేజీ -2లో భాగంగా దుద్యాల గేట్ నుంచి వయా కొడంగల్, తాండూర్, కర్నాటకలోని చించోళి హైవేకు కలుపుతూ వేసే రహదారికి పరిపాలనా అనుమతులు రావాల్సి ఉందన్నారు. దానికి సంబంధించిన అంచనాలు కూడా కేంద్రానికి సమర్పించినట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఈ జాతీయ రహదారి నిర్మాణం వల్ల దేశంలో ఏ నగరానికి లేని విధంగా.. మహబుబ్‌నగర్‌కు రింగు రోడ్డు 75 శాతం పూర్తి అవుతుందన్నారు. హైదరాబాద్‌కు సమాంతరంగా మహబూబ్‌నగర్ పట్టణంతో పాటు జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
ఇదీ చూడండి: