మహబూబ్‌నగర్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులను... మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించనున్నారు. మెుదట దేశంలోనే అతిపెద్ద మయూరీ అర్బన్ ఎకో పార్క్‌లో చేపట్టిన పనులను మంత్రి ప్రారంభిస్తారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే రెయిన్ ఫారెస్ట్ పరిసరాలను పరిశీలించనున్న కేటీఆర్....హరితహారంలో భాగంగా మెుక్కలు నాటుతారు.
ఎదిరలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవానాన్ని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. వీధి వ్యాపారుల కోసం అటవీ శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన షెడ్లను ప్రారంభిస్తారు. వీరన్నపేటలో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లను... 660 మంది లబ్దిదారులను అందిస్తారు. అప్పనపల్లి వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన రుణ మేళాలో పాల్గొంటారు.
ఇవీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1,269 మందికి కరోనా... మరో ఎనిమిది మంది మృతి