ETV Bharat / state

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - వర్షాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్

వరుసగా కురుస్తున్న వర్షాలు మహబూబ్ నగర్ జిల్లాపై ప్రభావం తీవ్ర ప్రభావం చూపాయి. పరిస్థితిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి సమీక్ష

author img

By

Published : Aug 16, 2020, 4:31 PM IST

మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాల ప్రభావంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. చేపట్టాల్సిన చర్యలపై యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయించాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, నిండిన చెరువుల వద్ద జేసీబీలను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజాప్రతినిధులను సైతం భాగస్వాముల్ని చేసుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.

అలుగుపారే అవకాశం..

మహబూబ్ నగర్ పెద్ద చెరువు అలుగుపారే అవకాశం ఉన్నందున ఇళ్లలోకి నీరు చేరుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలకు నీరు చేరితే అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కరోనా బాధితులు ఎవరైనా ఇళ్లలో ఉంటే వారికి ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించి వేరుగా ఉంచాలన్నారు. పోలీస్, నీటిపారుదల, రెవిన్యూ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

అప్రమత్తత..

ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం జిల్లా అధికారులకు తెలియజేయాలన్న మంత్రి... క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత కీలకమని చెప్పారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 08542-241165కు సమాచారం అందించాలని మంత్రి సూచించారు. వంట చేసుకునే పరిస్థితి లేనివారికి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేసే సిబ్బందిని అందుబాటులో ఉంచి వారికి భోజనం అందించాలన్నారు.

మినీ ట్యాంక్ బండ్ వద్ద 2 రెస్క్యూ టీమ్స్..

మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద 2 రెస్క్యూ టీమ్స్ ఏర్పాటు చేయాలని ఒక్కొక్క టీమ్ లో 10 మంది సభ్యులను పెట్టి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి సమాచారం అందించాలన్నారు. అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెంకట్రావు మంత్రికి తెలిపారు. పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి గ్రామాలలో పట్టణంలో ఉన్న అధికారులతో కలిసి పనిచేసే విధంగా తమ శాఖ పని చేస్తుందని జిల్లాలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తమ వంతు కృషి చేస్తామని ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.