హరితహారంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాకు నూతన శోభ చేకూరనుంది. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో మెగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. దీని కోసం దేవరకద్ర మండల కేంద్రంలోని పెద్ద చెరువు సమీపంలోని ఈశ్వర్ వీరప్పయ్య దేవాలయ భూమిని పరిశీలించారు. అందుకు సంబంధించి పూర్తి నివేదిక తయారు చేయాలని తహసీల్దార్ జ్యోతిని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతితో పూర్తి స్థలాన్ని సర్వే చేసి పెద్ద చెరువుపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పక్కనే మెగా ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాలు లేదా అంతకు పైగా స్థలాలను ఎంపిక చేసి జాతీయ గ్రామీణాభివృద్ధి నిధులతో హరితహారంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పూర్తిస్థాయి సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వనాల ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. మెగా ప్రకృతి వనాలతో పచ్చదనాన్నిపెంచడంతో పాటు హరిత శోభ నెలకొననుందని కలెక్టర్ అన్నారు.
ఇదీ చదవండి: ఈ నెల 26న కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్