ETV Bharat / state

మేమున్నామంటూ... కరోనా బాధితులకు ఇంటివద్దకే భోజనం

author img

By

Published : May 24, 2021, 4:50 PM IST

కరోనా రెండో దశ ఉద్ధృతితో ప్రభుత్వం మరోమారు లాక్‌డౌన్‌ విధించింది. ప్రజల సౌకర్యార్థం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వెసులుబాటు కల్పించినా.. ఎక్కడికక్కడ దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. చేసుకోవడానికి పనిలేక, తినడానికి తిండి దొరక్క పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరాశ్రయులు, భిక్షాటన చేసి జీవనం సాగించేవారు, ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువులు, సహాయకులు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ఆపత్కాలంలో కొందరు మేమున్నామంటూ భోజనం అందించేందుకు ముందుకు వస్తున్నారు. మహమ్మారి వేళ అభాగ్యుల ఆకలి తీరుస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

food
food
మేమున్నామంటూ... కరోనా బాధితులకు ఇంటివద్దకే భోజనం

కరోనా సోకిందంటేనే అయినవారు సైతం ఆమడదూరం ఉంటున్నారు. బంధుమిత్రులు దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. ఇక కుటుంబ సభ్యులందరూ కొవిడ్‌ బారిన పడితె వారి పరిస్థితి దారుణంగా ఉంది. బయటకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోలేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కొందరు దాతలు కొవిడ్‌ బాధితుల ఆకలి తీర్చడానికి నడుం బిగించారు. మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా వేడి వేడి భోజనం అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకొంటున్నారు.

మేమున్నామంటూ…

కొవిడ్‌ బారినపడిన కుటుంబాలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు కొందరు యువకులు, స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సేవా సంస్థలు. మహమ్మారి వేళ కరోనా బాధితులు, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు ఆహారానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన సత్యసాయి సేవా సమితి భోజనాలు తయారు చేసి ఫోన్‌ చేసిన వారి ఇంటికే భోజనాలు పంపిస్తున్నారు. కొవిడ్ బారిన పడినవారికి "ఇంటి వద్దకు సాయి ప్రసాదం" కార్యక్రమాన్ని చేపట్టి అన్నార్థులకు అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వాట్సాప్‌ నంబరుకు బాధితుల సంఖ్య, వివరాలు పంపిస్తే మధ్యాహ్న సమయానికి ఇంటికే భోజనం అందిస్తున్నారు. కొంత మంది సాయి భక్తులు (యువకులు) సేవా సమితిలోనే ఉంటూ.. నిత్యం 300 మందికి మధ్యాహ్నం, రాత్రికి సరిపోయే విధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు. వాటిని ప్యాకింగ్‌ చేసి క్రమ సంఖ్యల ఆధారంగా ఆటోలలో, మోటర్‌ సైకిళ్లపై ఇంటింటికి తిరిగి అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం సహకరించకపోవటంతో ఇళ్లలో వంట చేసుకోలేకపోవడం, లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లు కూడా మూతపడటంతో ఇబ్బందులు పడుతున్న వారి కోసం తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్నారు. బాధితులకు మంచి రుచికరమైన ప్రోటిన్‌ వంటలతో పాటు పళ్లు, డ్రైపూట్స్‌ను అందజేస్తున్నారు.

రెస్టారెంట్ మూసినా…

నవాబుపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన రవికి మండల కేంద్రంలో ఫ్యామిలి రెస్టారెంట్‌ ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా అది మూతపడటంతో కొవిడ్‌ బాధితులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. మండలంలో ఏ గ్రామంలో కొవిడ్‌ బాధితులు ఉన్నా ఆ కుటుంబ సభ్యులందరికీ రెండు పూటలా భోజనం అందిస్తున్నారు. ప్రతి రోజు ఎంత మందికి భోజనం అవసరమని చరవాణి ద్వారా వివరాలు సేకరించి అందుకనుగుణంగా అవసరమైన వంట రెస్టారెంట్‌లో చేస్తున్నారు. అవసరార్థులకు గ్రామ గ్రామానా తిరిగి భోజనం అందిస్తున్నారు.

గతేడాది తానూ కరోనా బారిన పడ్డానని... తనకు రెస్టారెంట్‌ ఉన్నా సమయానికి భోజనం లభించక చాలా ఇబ్బంది పడ్డానని.. ఆ అనుభవంతోనే కొవిడ్‌ బాధితులకు ఉచితంగా భోజనం అందిస్తున్నట్టు రవి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా బంధాలు, బంధుత్వాలు దూరమవుతున్న తరుణంలో కొవిడ్‌ బారిన పడి ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు ఉచితంగా భోజనం అందిస్తూ కుటుంబాల్లో ధైర్యాన్ని నింపుతున్నారు పలు స్వచ్చంద, ఆధ్యాత్మిక సంస్థలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.