ETV Bharat / state

లాక్‌ డౌన్‌: నిర్మానుష్యంగా మారిన దేవరకద్ర సంత - devarakadra bulls market lockdown

కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానకి ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రతివారం జరిగే దేవరకద్ర సంత ఈ రోజు జనాలు లేక నిర్మానుష్యంగా మారింది.

mbnr devarakadra people strictly follow the lockdown devarakadra market lockdown
లాక్‌ డౌన్‌: నిర్మానుష్యంగా మారిన దేవరకద్ర సంత
author img

By

Published : Mar 25, 2020, 2:23 PM IST

Updated : Mar 25, 2020, 2:54 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు లాక్‌డౌన్‌లో స్వచ్ఛందంగా పాల్గొని కరోనా నివారణలో తమ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ... జిల్లా ప్రజలు సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ వారి స్ఫూర్తిని చాటుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో నిర్వహించే ప్రధాన పశువుల సంతల్లో దేవరకద్ర సంత ఒకటి. రూ. కోటికి పైగా వ్యాపారం జరిగే ఈ సంతలో తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే పశువుల వ్యాపారులు, రైతులు క్రయవిక్రయాలు జరుపుతారు. 73 ఏళ్లుగా జరుగుతున్న ఈ అంగడి... కరోనా ప్రభావంతో ప్రజలు లేక నిర్మానుష్యంగా కనబడుతోంది.

కూరగాయల వ్యాపారం సైతం అంతంతగానే సాగుతోంది. నిత్యావసరాల సరుకులు, పండుగ సామాగ్రి కోసం కిరాణా దుకాణాల వద్ద సామాజిక దూరం పాటిస్తూ క్రయ విక్రయాలు జరుపుతున్నారు. లాక్‌డౌన్‌లో సంపూర్ణంగా పాల్గొంటూ... అవసరమైతేనే ఇంటినుంచి బయటకు వస్తున్నారు.

లాక్‌ డౌన్‌: నిర్మానుష్యంగా మారిన దేవరకద్ర సంత

ఇదీ చూడండి: 'ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కఠిన నిర్ణయాలు తప్పట్లేవ్​'

Last Updated : Mar 25, 2020, 2:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.