ETV Bharat / state

అక్రమ నిర్మాణాలు నేలమట్టం - పాలమూరులో అక్రమ నిర్మాణాలు నేలమట్టం

ప్రభుత్వ భూములపై పర్యవేక్షణ కొరవవడం వల్ల.. కబ్జాదారులు అక్రమాలకు తెరలేపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం ఆదర్శనగర్‌లో అనేక పర్యాయాలు జారీ చేసిన ఇళ్ల పట్టాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేపట్టి అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లను కూల్చివేశారు.

Maharubnag district headquarters of Adarshanagar illegal structures
అక్రమ నిర్మాణాలు నేలమట్టం
author img

By

Published : Jun 8, 2020, 12:32 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం సమీపంలోని సర్వే నంబర్ 523లో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. భూముల ధరలు పెరగటం వల్ల అసైన్డ్‌ భూములపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. 1989-90 నుంచి 2016 వరకు విడతల వారీగా పేదలకు, దివ్యాంగులకు కేటాయించిన భూములు అక్రమార్కులు కబ్జాకు పాల్పడ్డినట్లు గుర్తించారు. కొందరికి ఎలాంటి పట్టాలు లేకపోయినా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు.

బోగస్‌ పట్టాలపై విచారణ

దివ్యాంగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో బోగస్‌ పట్టాదారులను గుర్తించేందుకు అధికారులు ఏఆర్‌ఐ, సర్వేయర్‌, సీనియర్‌ సహాయకుడు, వీఆర్వో, వీఆర్‌ఏలతో కలిపి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు గతంలో కేటాయించిన ఇంటిస్థలం పట్టా, ప్రస్తుతం నివాసం ఉన్నవారి ఆధార్‌కార్డు ఇతర ధ్రువీకరణ పత్రం తదితర అంశాలపై వివరాలు సేకరించారు.

42 ఇళ్లు.. నేలమట్టం

ఆ భూములపై పలుమార్లు విచారణ జరిపిన అధికారులు.. బోగస్‌ పట్టాలుగా తేల్చారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పాటు అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లు, పునాదులన్నింటినీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూల్చివేశారు. అర్బన్‌ మండల తహసీల్దారు పార్థసారథి, ఉప తహసీల్దారు రాజగోపాల్‌, ఆర్‌ఐ క్రాంతి గౌడ్‌, వీఆర్వోల బృందం అర్ధరాత్రి సమయంలో.. సుమారు 42 ఇళ్లను నేలమట్టం చేశారు. నోటీసులు ఇవ్వకుండా.. రెవెన్యూ అధికారులు కూల్చి వేయడం వల్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: తీవ్ర ఉత్కంఠ.. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.