ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్బర్ పథకం కింద మహబూబ్నగర్ మున్సిపాలిటీ ఎంపిక అయినట్లు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ పథకం కింద దేశంలో 125 మున్సిపల్ పట్టణ ప్రాంతాలు ఎంపిక కాగా అందులో మహబూబ్ నగర్ ఒకటి అని ఆయన వెల్లడించారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్బర్ నిధి కింద ఎంపికైన మున్సిపాలిటీలలో వీధి వ్యాపారుల ఆర్థిక, సామాజిక వివరాలతో కూడిన నివేదికను వెంటనే తయారు చేయాలని సంజయ్ కుమార్ మిశ్రా కోరారు. వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలు వర్తింపచేస్తామని అన్నారు.
కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎపీఓలతో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులు, నర్సరీలు, వైకుంఠ ధామాలుకు సంబంధించిన పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో ప్రతిరోజు పారిశుధ్యం పనులు చేపట్టాలని తెలిపారు.
పెండింగ్లో ఉన్న పనులు వేగవంతం చేసి అనుకున్న సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. వాటికి సంబంధించిన చెల్లింపులు జరిగేందుకు బిల్లులు సమర్పించి సమగ్ర నివేదికతో తదుపరి నిర్వహించే సమీక్షా సమావేశమునకు హజరుకావాలని అన్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత అధికారులకు హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆర్. నారాయణమూర్తి అందుకే పెళ్లి చేసుకోలేదు!