ETV Bharat / state

కొనసాగుతున్న లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవాలు - Mahabubnagar District Latest News

మహబూబ్‌నగర్‌ జిల్లా లింగాపూర్‌ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము వరకు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు ఆలయ ప్రాంగణంలో వంటకాలు చేసి స్వామికి నైవేద్యం సమర్పించారు.

Lingapur Lakshmi Chennakeshava Swamy Festival continues
కొనసాగుతున్న లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవాలు
author img

By

Published : Feb 20, 2021, 7:01 AM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం లింగాపూర్‌లో లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి మొదలై తెల్లవారుజాము వరకు వేలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది.

పుష్పాలతో అలంకరించిన రథాన్ని వేద మంత్రాల మధ్య ముందుకు లాగారు. ఉత్సవాల్లో జిల్లా నుంచే కాకా రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు పాల్గొంటున్నారు. వేలాది మంది తరలిరావడంతో బందోబస్తు చర్యలు చేపట్టారు. వారం రోజుల పాటు జరిగే ఈ రథోత్సవాల్లో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

భక్తులు ఆలయ ప్రాంగణంలో వంటకాలు చేసి చెన్నకేశవునికి నైవేద్యం సమర్పించారు. తమ కోరికలు తీర్చిన స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్ తేజస్ సమీక్షించారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి: రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.