మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో కలెక్టర్ ఎస్. వెంకటరావు మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారికి సూచించారు. మొక్కలకు ఎప్పటికప్పుడు నీరు పెట్టాలని.. నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చూడాలని ఆదేశించారు.
అంతకుముందు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న రామానుజన్ విగ్రహానికి కలెక్టర్ నివాళి అర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఇదివరకు నాటిన మొక్కలను పరిశీలించారు. ఆదివారం ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా పాత వస్తువుల్లో, టైర్లు, పూల కుండీలలో ఉన్న నీటిని పారబోశారు.