ETV Bharat / state

అటవీ అధికారుల కృషి... పచ్చదనంతో కళకళలాడుతోన్న పిల్లలమర్రి

పాలమూరు జిల్లాకే తలమానికమైన పిల్లలమర్రి సంరక్షణకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. మహబూబ్​నగర్ సమీపంలోని పిల్లల మర్రి చెట్టును, కొత్తగా వచ్చిన ఊడలను పరిశీలించారు.

'పిల్లలమర్రి సంరక్షణకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి'

author img

By

Published : Nov 6, 2020, 5:05 AM IST

పాలమూరు జిల్లాకే తలమానికమైన పిల్లలమర్రి సంరక్షణకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. మహబూబ్​నగర్ సమీపంలోని పిల్లల మర్రి చెట్టును, కొత్తగా వచ్చిన ఊడలను పరిశీలించారు. పిల్లలమర్రి ఊడలు పాడైపోయి, శిథిలావస్థకు చేరుకున్న దశ నుంచి కొత్త ఊడలు వచ్చేలా చేసి పచ్చదనాన్ని నింపటంలో జిల్లా అటవీ శాఖ అధికారులు చేసిన కృషిని ఆయన అభినందించారు.

రెండేళ్ల కిందట వివిధ కారణాలతో శిథిలావస్థకు చేరుకోవడమే కొమ్మలు, ఊడలు విరిగిపోయాయి. ఈ దశలో జిల్లా అటవీ శాఖ పిల్లలమర్రిని సంరక్షించే బాధ్యతలను చేపట్టింది. చెదలు, తెల్లపుండు నివారణ కోసం క్లోరోఫైరిఫస్ ద్రావాణాన్ని సెలైన్ బాటిళ్ల ద్వారా కొమ్మల్లోకి ఎక్కించారు.

పడిపోయేందుకు వీలుండే ఊడల కింద సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేశారు. చెట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాల్ని, ఎరువులను మట్టి ద్వారా అందించారు. సహజ పద్ధతిలో నీరు ఎరువులు ఇవ్వడం వల్ల ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతోంది.

ఇదీ చదవండి: హైదరాబాద్​ చుట్టూ ఐటీ క్లస్టర్ల ఏర్పాటు: మంత్రి కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.