కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు అందుతున్న సౌకర్యాలను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట రావు ఆకస్మికంగా పరిశీలించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు భూత్పూర్ మండలం రాజీవ్ స్వగృహ, అమిస్తాపూర్ కంటైన్మెంట్ ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ కంటైన్మెంట్ ప్రాంతాలకు సిబ్బంది వస్తున్నారా..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా...? అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
అనంతరం భూత్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో కరోనాపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కంటైన్మెంట్ జోన్లలో, ఐసోలేషన్లో ఉన్న వారిని బయటికి రాకుండా చూడాలని... ఆ ప్రాంతాలను వైద్య బృందాలు, ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కేసుల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పాజిటివ్ ఉన్నవారికి మందులతో పాటు మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా అందించాలన్నారు. వైరస్ కట్టడి కోసం రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు అందరు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కంటైన్మెంట్ ప్రాంతాల పరిధిని మరింత విస్తరించాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు.
ఇవీ చూడండి: బ్యాంకు ఉద్యోగిపై.. దానం నాగేందర్ దౌర్జన్యం!