మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రొనార్డ్రోస్ 30 రోజుల ప్రణాళికపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అడ్డాకుల మండలం కాటవరం సహా 14 మండలాల్లో పర్యటించారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బహిరంగ మలమూత్ర రహిత జిల్లాగా ప్రకటించిన సందర్భంగా గ్రామంలో మురికికాలువలు, వీధుల పరిశుభ్రత, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, హరితహారం పనులను సమీక్షిస్తున్నారు. గ్రామసభలు, శ్రమదానం, డంపింగ్యార్డు, శ్మశాన వాటికలకు స్థలాల గుర్తింపు మెదలగు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 442 గ్రామపంచాయతీల్లో 2500 పాడుబడ్డ ఇళ్లను తొలగించారు. 440 గ్రామాల్లో శ్రమదానం పూర్తి చేశారు. 220కి పైగా గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్యార్డ్ల కోసం స్థలాలు గుర్తించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఇదీ చూడండి :తెలంగాణ విశ్వవిద్యాలయంలో బతుకమ్మ సంబురాలు