చట్ట వ్యతిరేకులకు, దుర్మార్గులకు భయం కలిగించేలా పోలీసులు పనిచేస్తారని మహబూబ్ నగర్ నూతన ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సామాన్య ప్రజలకు అన్యాయం జరిగినా.. మోసపోయినా పోలీసులు ఉన్నారన్న భరోసా కల్పించేలా పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి బదిలీ కావడంతో ఆమె స్థానంలో బాధ్యతలు స్వీకరించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తామని.. నేరగాళ్లకు తగిన శిక్ష పడే విధంగా పనిచేస్తామన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల పరిపాలన సులువైందన్న ఆయన.. పాలమూరు జిల్లా ప్రజలకు సమర్థవంతంగా సేవలందిస్తామని హామీ ఇచ్చారు. పోలీసు, మీడియా మధ్య అవినాభావ సంబంధం కొనసాగుతుందని ఎస్పీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.