మహబూబ్‌నగర్ జిల్లాను అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి జడ్చర్ల వరకు నిర్మించనున్న నాలుగు వరసల రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు రూ.219 కోట్లతో పనులు జరుగుతాయన్నారు. పట్టణానికి బైపాస్ రహదారి నిర్మాణం, జాతీయ రహదారికి అనుసంధంగా రాయచూరు వరకు మరో రోడ్డును నిర్మిస్తామని హామి ఇచ్చారు.
ఇవీ చూడండి: లోక్‌సభాపక్ష నేత ఎంపికపై తెరాస కసరత్తు