ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన - Mahaboobnagar Collector responded on place Controversy

మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని లావుని పట్టా భూములు అన్యాక్రాంతంపై ఈటీవీ భారత్​ కథనానికి స్పందన లభించింది. భూ వివాదంపై స్పందించిన కలెక్టర్ వెంకట్రావు విచారణకు ఆదేశించారు.

Mahaboobnagar Collector responded on place Controversy

author img

By

Published : Jun 7, 2020, 6:43 PM IST

మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని పాలకొండ గ్రామ సరిహద్దులో ఉన్న లావుని పట్టాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఈటీవీ భారత్ కథనానికి కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా అదనపు కలెక్టర్​ను ఆదేశించారు.

పాలకొండ గ్రామ సరిహద్దులోని 79వ సర్వే నెంబర్లలోని లావుని పట్టా భూముల్లో క్రయవిక్రయాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సర్వే నెంబర్లలో 3, 4 సబ్ డివిజన్లుగా పట్టా భూములు ఉన్నాయన్నారు. ఇందులో కొన్ని ప్రైవేటు పట్టా భూములు ఉండగా... మరికొన్ని లావుని పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. వీటిలో లావుని పట్టా భూములు ఏ సబ్ డివిజన్ కిందకు వస్తాయి అనే అంశంపై విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా అదనపు కలెక్టర్ ను ఆదేశించినట్టు వివరించారు. ఆ నివేదికను రెవెన్యూ రికార్డులతోపాటు సబ్ రిజిస్ట్రార్ రికార్డులతో సరి చూసిన అనంతరం వాటిపై చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.