ETV Bharat / state

గ్రేటర్​ ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక బస్సులు: కలెక్టర్

వచ్చేనెల ఒకటో తేదీన జరగనునున్న గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు మహబూబ్​నగర్ జిల్లా పాలనాధికారి ఎస్.వెంకటరావు వెల్లడించారు. ప్రస్తుత ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నందున అలసత్వం పనికిరాదని సిబ్బందికి సూచించారు.

mahaboobnagar collector  instuctions  gives Election duty employees
గ్రేటర్​ ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక బస్సులు: కలెక్టర్
author img

By

Published : Nov 27, 2020, 11:18 PM IST

జీహెచ్​ఎంసీలో జరగనున్న ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉద్యోగుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నందున విధుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదన్నారు.

విధులకు హాజరవుతున్న వారి కోసం ఈనెల 30న ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉద్యోగులు ఎవరైనా హాజరు కాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పాలనాధికారి హెచ్చరించారు.

ఇదీ చూడండి:30 చోట్ల జీహెచ్‌ఎంసీ ఓట్ల కౌంటింగ్‌.. ఏర్పాట్లు పూర్తి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.