ETV Bharat / state

అలంకార ప్రాయంగా మినీఎత్తిపోతల పథకాలు - తెలంగాణ వార్తలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా, తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లోని రైతులు మినీఎత్తిపోతల పథకాలపై ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్లు. కాని సగానికి పైగా చిన్నతరహా ఎత్తిపోతల పథకాలు నేడు అలంకార ప్రాయంగా మిగిలాయి. మోటార్లు మరమ్మతులకు గురై బాగుచేయించే దిక్కులేక పనికి రాకుండా పోయాయి. కొన్ని ఎత్తిపోతలు సగం ఆయకట్టుకే నీరందిస్తున్నాయి. వీటి నిర్వాహణ బాధ్యత రైతులదే ఆయినా, మరమ్మతులు, అసంపూర్తి పనులు రైతులకు తలకుమించిన భారంగా మారుతోంది. పట్టించుకునే దిక్కులేక నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. తుంగభద్ర, కృష్ణా నదులకు వరదలొచ్చే సమయం ఆసన్నమవుతున్న వేళ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మినీ ఎత్తిపోతల పథకాల అమలు తీరుపై కథనం.

lift irrigation schemes
మినీఎత్తిపోతల పథకాలు
author img

By

Published : Jun 24, 2021, 4:58 AM IST

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మినీ ఎత్తిపోతల పథకాలు అలంకార ప్రాయంగా మారుతున్నాయి. ఐడీసీ మహబూబ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో 45 మినీ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటన్నింటిని ప్రస్తుతం నీటి పారుదల శాఖ కిందకు తీసుకువచ్చారు. ఇందులో సగానికి పైగా నిరుపయోగంగా ఉన్నాయి. చాలాచోట్ల మోటార్లు చెడిపోయి పనికిరాకుండా తయారయ్యాయి. 2017లో 11 కోట్లతో మరమ్మతులు చేపట్టినా.. మోటార్లు మళ్లీ మొరాయిస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి మరమ్మతులు చేయించాల్సి ఉన్నా.... నీటిపారుదల శాఖ పట్టించుకోకపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదు.

శిథిలావస్థకు శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల

నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడెబల్లూరులోని శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల పథకాన్ని... భీమా రెండో దశలో భాగంగా 20 ఏళ్ల కిందట నిర్మించారు. దీని ద్వారా గుడెబల్లూరు, కున్సి, హిందూపూర్ గ్రామాలకు చెందిన సుమారు 1600 ఎకరాలకు సాగునీరు అందించాలని రూపకల్పన చేశారు. కాని ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీళ్లందాయి. ఆ తర్వాత మోటార్లు మరమ్మతులకు గురికాగా.... వాటిని బాగు చేయించలేదు. 3 మోటార్లుండగా రెండింటిని మరో చోటుకు తరలించి వినియోగిస్తున్నారు. ఉన్న ‍ఒక్కమోటారు వినియోగంలో లేకపోవటంతో..... ఎత్తిపోతల పథకం శిథిలావస్థకు చేరింది. ఫలితంగా రెండు పంటలకు నీరందక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

18 మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఉట్కూరులో 14 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా..... సుమారు 1400 ఎకరాలకు గతేడాది కేవలం 100 ఎకరాలకే సాగునీరు అందింది. గుత్తేదారు పనుల్ని అసంపూర్తిగా వదిలేయటంతో.... లీకేజీలు ఏర్పడ్డాయని రైతులు వెల్లడించారు. అందువల్ల చివరి ఆయకట్టు వరకు నీరు చేరటం లేదని తెలిపారు. అయితే.... అలంపూర్, క్యాతూరు ఎత్తిపోతల పథకాలకు ఏకకాలంలో నిధులు మంజూరు చేసి ప్రారంభించటంతో... ఆయకట్టుకు నీరంది రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఉట్కూరు ఎత్తిపోతల పథకానికి అదేవిధంగా పనులు జరిపించాలని కోరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 45 ఎత్తిపోతల పథకాలకగాను.... 18 మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. మరో 14 ఎత్తిపోతల పథకాలు సగం ఆయకట్టుకే నీరందిస్తున్నాయి. నిరుపయోగంగా ఉన్నవి ఏడైతే.. ఆరు అసలు పనికి రాకుండా పోయాయి.

ఇదీ చదవండి: Inter: సెకండియర్ ఫలితాలకు మార్గదర్శకాలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.