మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రాఘవపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 36లో గల 3 ఎకరాల 15 గుంటల భూమికి సంబంధింన వివాదాన్ని పరిష్కరించాలంటూ ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని గురాల లక్ష్మమ్మ ఆరోపించారు. తమకు చెందాల్సిన భూమిని తోటికోడలు ఇతరులకు అమ్మేసి ఈరి నుంచి వెళ్లిపోయిందని...కొన్నవాళ్లెవరో తెలియదని న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఈ వివాదాన్ని పరిష్కరించాలని 6 నెలలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి తిరగడానికి డబ్బులు లేక నిన్నరాత్రి కార్యాలయంలోనే నిద్రించనట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు.
ఇవీ చూడండి: నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై విచారణకు ఆదేశం