ETV Bharat / state

రేపటి నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - Kurumoorthy jathara Starts from Saturday

పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలంలోని శ్రీ కురుమూర్తి శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలను సాంప్రదాయబద్ధంగా... భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని నిర్ణయించారు.

రేపటి నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

author img

By

Published : Nov 13, 2020, 9:59 PM IST

మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని శ్రీ కురుమూర్తి శ్రీనివాసుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి కొండలను పోలినట్లు కురుమూర్తి కొండలైన శేషాద్రి, ఏకాద్రి, దుర్గాద్రి, ఘానాద్రి, బళ్లు కాద్రి, పతాద్రి, దైవతాద్రి, దేవుని గుట్ట.. ఇలా ఏడు కొండల మధ్య దేవుని గుట్టలో కొలువుదీరిన కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా దక్షణ తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

ప్రత్యేక ఉత్సవాలు...

ఆశ్విజ మాసం అమావాస్య మొదలు కార్తీక మాసం పాడ్యమి నుంచి సప్తమి వరకు ఆలయంలో వారం రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు కొనసాగుతాయి. రోజుకో వాహన సేవలు నిర్వహిస్తూ... కార్తీకమాసమంతా స్వామివారి జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. ప్రధానంగా 16న స్వామి వారి కల్యాణోత్సవం, 19న స్వామివారి అలంకార ఉత్సవం, 21న స్వామివారి ఉత్సవాల్లో ప్రధాన ఉత్సవమైన ఉద్దాల ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

ఊరేగింపులు లేకుండా...

ఉత్సవాలు అన్నీ కూడా ఎలాంటి ఊరేగింపులు లేకుండా నియమిత భక్తుల సమక్షంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు స్వామివారి ఈ క్షేత్రంలో కొలువైన కోనేటిలో కాకుండా సాధారణ కుళాయిల దగ్గర స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకొని బస చేయకుండా వెంటనే తిరుగు ప్రయాణం చేయవలసిందిగా అధికారులు కోరుతున్నారు. కురుమూర్తి జాతరలో వ్యాపారాలు నిర్వహించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు మరి కొన్ని రాష్ట్రాల వ్యాపారులు వివిధ రకాల వస్తువులను విక్రయిస్తుంటారు.

ప్రత్యేక ఏర్పాట్లు...

ఇక్కడ వివిధ రకాల మసాలా దినుసులతో తయారుచేసే కాల్చిన మాంసం విక్రయాలకు ప్రత్యేకత ఉంది. ఈసారి ఎలాంటి వ్యాపారాలు లేకుండా, మద్యం మాంసం, వినోద కార్యక్రమాలకు చోటు లేకుండా కేవలం స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతర ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. భక్తులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ... స్వామిని దర్శించుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: గవర్నర్​ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి పేర్లు ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.