ETV Bharat / state

పాలమూరు పల్లె జాతర్లో... పశువుల సంత - kurumurthi bramhotsavalu at palamuru

మహబూబ్​నగర్​ జిల్లాలో కురుమూర్తి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె జాతరగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవాలు రైతులు తమకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు, కోడె దూడెలను కొనుగోలు చేస్తుంటారు.

మహబూబ్​నగర్​లో కురుమూర్తి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Nov 5, 2019, 4:45 PM IST

మహబూబ్​నగర్​లో కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్​లో కురుమూర్తి స్వామి జాతర వైభవంగా కొనసాగుతోంది. నెలరోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున పల్లె ప్రజలు తరలివస్తారు. ఈ జాతరలో రైతులు తమకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు, కోడె దూడలు కొనుగోలు చేస్తారు. ఒక్కో కోడె దూడ జంట ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ధర పలకడం విశేషం. దూడ నోటి పండ్ల సంఖ్యను బట్టి దాని వయసును, ధరను నిర్ణయించి రైతులు కొనుగోలు చేస్తారు.

Intro:Tg_Mbnr_01_05_Nallamalla_To_Kurumoorthi_VO_TS10094
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తి స్వామి జాతర మైదానంలో స్థానిక జాతులకు చెందిన దూడల అమ్మకాలు జోరుగా కొనసాగడం విశేషం

Body:మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు ముగిసినా.. నెల రోజుల పాటు జాతర కొనసాగుతుంది.
ఈ జాతరంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే అత్యధికంగా వస్తుండడంతో పల్లె జాతర గా ప్రసిద్ధి చెందింది
గ్రామీణ ప్రాంత రైతాంగం వారికి అవసరమైన వ్యవసాయ పనిముట్లను, కోడె దూడలను ఇక్కడే కొనుగోలు చేసి తిరిగి గ్రామాలకు వెళ్తుంటారు.
కురుమూర్తి జాతర లో కొనుగోలు చేసే కోడె దూడలు నల్లమల ప్రాంతమైన నాగర్ కర్నూల్ జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి రావడం విశేషం. స్థానిక జాతులకు చెందిన కోడె దూడలను పశువుల కాపర్లు జాతరకు వారం రోజుల ముందుగానే కాలినడకన 150 నుంచి 200 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి విక్రయించటం విశేషం. రైతుల ఆదరణను పసిగట్టిన నారాయణపేట జిల్లాకు చెందిన ఎద్దుల వ్యాపారులు నల్లమలలో కోడె దూడల మందలను కొనుగోలు చేసి ఈ ప్రాంత రైతాంగానికి జాతరలో అమ్మడంతో భారీ స్థాయిలో కొనసాగుతుంది.
ఒక్కో జంట కోడె దూడలు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ధర పలకడం మరో విశేషం. దూడకు వచ్చిన నోటి పండ్ల సంఖ్యను బట్టి దాని వయసును, ధరను నిర్ణయించి రైతులు కొనుగోలు చేస్తారు.

Conclusion: నల్లమల ప్రాంతంలో పశువుల కాపరులు పోషణ లో పుట్టి పెరిగిన కోడె దూడలు మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ రైతాంగం వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర పోషించడం విశేషంగా చెప్పుకుంటారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.