ETV Bharat / state

పార్టీ మార్పుపై కొత్తకోట దంపతుల సమాలోచనలు!

పార్టీ మార్పుపై కొత్తకోట సీత దయాకర్ రెడ్డి దంపతులు కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. మెగా రక్తదాన శిబిరంపై సమీక్ష నిర్వహించిన వారు... త్వరలో పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అప్పటివరకూ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు.

kothakota-seetha-dayakar-reddy-press-meet-on-blood-camp-at-devarakadra-in-mahabubnagar-district
పార్టీ మార్పుపై కొత్తకోట దంపతుల సమాలోచనలు!
author img

By

Published : Jan 17, 2021, 9:13 AM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా తెదేపా మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట సీత దయాకర్ రెడ్డి దంపతులు.. పార్టీ మార్పుపై కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఈనెల 18న ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై కార్యకర్తలతో కలిసి సమీక్షించారు.

రాజకీయాల్లో అందరూ వారి స్వార్థంతో కుటుంబ ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నారు తప్పా కార్యకర్తల కోసం కాదని దయాకర్ రెడ్డి ఆరోపించారు. కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ మార్పుపై కార్యకర్తలతో చర్చించారు. అప్పటివరకూ క్షేత్రస్థాయిలో ఇసుక, లిక్కర్ మాఫియాను అడ్డుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై కార్యకర్తలు పోరాటం చేయాలని కోరారు. ఈనెల 18న నిర్వహించే మెగా రక్తదాన శిబిరంలో కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: తెలంగాణకు బహుళవిధ లాజిస్టిక్స్‌ పార్కు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.