మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల సరిహద్దులో ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. సాగు, తాగునీరు అందిస్తూ రెండు జిల్లాల వాసుల నీటి అవసరాలను తీరుస్తోంది. జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా జలాశయానికి నీటిని తరలించారు.
వర్షాకాలం చివర్లో కురిసిన వర్షాలకు నీటిమట్టం పెరిగి నిండుకుండను తలపిస్తోంది. జలాశయాన్ని సందర్శించేందుకు పర్యటకులు వచ్చి వారాంతపు సెలవుల్లో సందడి చేస్తున్నారు.
ఇవీ చూడండి : విషాదం: తండ్రి ఆగ్రహం.. కొడుకు బలవన్మరణం