హైదరాబాద్ గచ్చిబౌలీ పరిధిలోని జనార్దన్ హిల్స్‌లోని ఓ వసతి గృహంలోని ఉంటున్న ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన చరణ్‌రాజ్... నిన్న రాత్రి బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఎన్టీయూలో బీటెక్ చదువు పూర్తి చేసిన చరణ్ మాదాపూర్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో పోటీ పరీక్షల నిమిత్తం శిక్షణ తీసుకుంటున్నాడు.
అయితే ఇటీవలే నిర్వహించిన పోటీ పరీక్షలకు అతడు గైర్హాజరయ్యాడని తండ్రి మందలించాడు. దీనితో మనస్తాపం చెంది.. ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన చరణ్‌ను హాస్టల్ నిర్వాహకులు ఆస్పత్రికి తరలించే మార్గమధ్యలో మృతి చెందాడు.
ఇదీ చూడండి: కాచిగూడ రైలు ప్రమాదం... లోకో పైలట్ మృతి