"నేను దిల్లీకి వస్తానని వాళ్లకు భయం పట్టుకుంది" - మహబూబ్ నగర్
దేశ ప్రధాని మోదీ... పచ్చి అబద్ధాలాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తాను రాష్ట్ట్రాభివృద్ధికి అడ్డుపడ్డానని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులివ్వాలని 500 లేఖలు రాసినా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆవేదన చెందారు.
మహబూబ్ నగర్ సభలో కేసీఆర్
మిషన్ భగీరథ పథకానికి రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా... కేంద్ర ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మహబూబ్నగర్ తెరాస బహిరంగ సభలో పాల్గొన్నారు. తాను దిల్లీకి ఎక్కడ వస్తానో అని భాజపా, కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.