మహబూబ్‌నగర్ జిల్లా జైలులో ఖైదీలకు కల్పించిన సదుపాయాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ ఎస్.ప్రేమావతి పరిశీలించారు. జైలులోని బారక్‌లను, వంట గదులను తనిఖీ చేశారు. ఖైదీల న్యాయ సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
కరోనా నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి.. కొవిడ్ నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
- ఇదీ చదవండి: టీకా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?