ETV Bharat / state

ఎన్-క్వాస్​ ధ్రువీకరణకు దూరంగా ఆరోగ్య కేంద్రాలు..! - తెలంగాణ తాజా వార్తలు

NQAS certification to mahbubnagar phc : ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్​-క్వాస్ ధ్రువీకరణ ఉందంటే.. అక్కడ రోగులకు అత్యుత్తమ సేవలు అందుతున్నట్లు లెక్క. అలాంటి ఆరోగ్య కేంద్రాలకు ఏటా రూ.3లక్షల నిధులు కేటాయిస్తారు. వాటితో మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చు. కాని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్-క్వాస్ పొందడంలో వెనకబడ్డాయి. 77 కేంద్రాలుంటే ఇప్పటివరకూ ధ్రువీకరణ పొందింది కేవలం 18. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఆరోగ్య కేంద్రాలు ధ్రువీకరణ పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరోగ్య కేంద్రాల పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

NQAS certification to mahbubnagar phc, NQAS certificate news
ఎన్-క్వాస్​ ధ్రువీకరణకు దూరంగా ఆరోగ్య కేంద్రాలు..!
author img

By

Published : Feb 7, 2022, 1:48 PM IST

NQAS certification to mahbubnagar phc : జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలను(నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ స్టాండర్డ్స్) చేరుకోవడంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పీహెచ్​సీలు వెనకబడ్డాయి. ఐదు జిల్లాల్లో 77 ఆరోగ్యకేంద్రాలకు గాను మహబూబ్​నగర్ జిల్లాలో-6, నారాయణపేట-01, నాగర్ కర్నూల్-05, వనపర్తి-02, జోగులాంబ గద్వాల జిల్లాలో-4 మాత్రమే ఎన్-క్వాస్ ధ్రువీకరణ పొందాయి. మిగిలిన కేంద్రాలు నాణ్యతా ప్రమాణాలను చేరుకోవడంలో విఫలమవుతున్నాయి.

మూడేళ్ల పాటు ఏటా రూ.3లక్షల నిధులు

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అంతర్జాతీయ, జాతీయ అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ప్రజలకు సేవలందించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలను రూపొందించింది. వాటిని పాటించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్రం మూడేళ్ల పాటు ఏటా రూ.3లక్షల నిధులు మంజూరు చేస్తుంది. తద్వారా పీహెచ్​సీలను బలోపేతం చేయాలన్నది లక్ష్యం. ఎన్-క్వాస్ ధ్రువీకరణ ఉందంటే అక్కడి ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో సేవలు అందుతున్నట్లు పరిగణిస్తారు.

50 అంశాల లెక్కింపు

కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలను చేరుకోవడం సులువేం కాదు. ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న సేవలు, రోగుల హక్కులు, వసతులు, ఇన్​ఫెక్షన్ నియంత్రణ, నాణ్యత ప్రమాణాల నిర్వాహణ, సేవల ఫలితాల తీరును కేంద్ర బృంద సభ్యులు సమీక్షిస్తారు. బయటి రోగుల విభాగం, లేబర్ రూమ్, ఇన్​పేషెంట్ విభాగం, ల్యాబ్ సేవలు, జాతీయ ఆరోగ్య మిషన్, సాధారణ పరిపాలన ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూస్తారు. 50రకాల ప్రమాణాలు ఆధారంగా 250 అంశాలను లెక్కిస్తారు.

  • పరిశుభ్రత ఎలా ఉంది?
  • కనీస వసతులున్నాయా?
  • రికార్డులు నిర్వహిస్తున్నారా ?
  • కేంద్రంలో అందే సేవలు రాష్ట్ర, జాతీయ సగటుతో పోల్చితే ఎలా ఉన్నాయి?
  • ప్రభుత్వ ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయా?
  • సమాచార బోర్డులు
  • నేలశుభ్రత
  • పచ్చదనం
  • ప్రహారీ
  • సిబ్బంది ప్రవర్తన
  • రోగుల సంతృప్తి స్థాయిలు

ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. 70శాతం కంటే అధికంగా స్కోర్ సాధించిన ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలకు మాత్రమే ఎన్-క్వాస్ ధ్రువీకరణ దక్కుతుంది.

ఎన్​క్యూఏఎస్ సర్టిఫికెట్ ఇచ్చే సెంట్రల్ కమిటీ అన్ని అంశాలను పరిశీలిస్తుంది. పీహెచ్​సీలో అమలవుతున్న ప్రమాణాలపై సర్టిఫికెట్ ఇస్తారు. ఆ ధ్రువీకరణ పత్రం ఆరోగ్యకేంద్రం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అదనపు నిధులు వస్తాయి.

-పీహెచ్​సీ డాక్టర్

నేషనల్ టీమ్ 50 రకాల స్టాండర్డ్స్ చూస్తారు. 6 చెక్ లిస్టులను బేస్ చేసుకొని లెక్కిస్తారు. వాటిని బేస్ చేసుకొని స్కోరింగ్ ఇస్తారు. 70శాతం కంటే ఎక్కువగా ఉంటే ఎన్​-క్వాస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈసారి అన్ని కేంద్రాలు ధ్రువీకరణ పత్రం పొందాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఆ దిశగా మేం వర్క్ చేస్తున్నాం.

-పీహెచ్​సీ డాక్టర్

మొట్టమొదటిగా 2018లో పీహెచ్​సీ కోడేరు ఎంపికైంది. పీఎచ్​సీ కల్వకుర్తి 95 స్కోర్​తో భారతదేశంలోనే అత్యధిక స్కోరుతో గుర్తింపు పొందింది. ధ్రువపత్రం కోసం మా వైద్యులు, సిబ్బంది శతవిధాలుగా కృషి చేస్తున్నారు.

-రేణయ్య, ఎన్​హెచ్​ఎం డీపీవో

ఈసారి స్పెషల్ ఫోకస్

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని అన్ని పీహెచ్​సీల్లో నాణ్యతా ప్రమాణాల​కు లోబడి లేకపోవడంతో దశల వారీగా ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఈ నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ఐదు జిల్లాలకు క్వాలిటీ మేనేజర్లు ఉండాలి. ఈ ఐదు పోస్టులూ ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో ముందడుగు పడటం లేదు. ఈసారి అన్ని పీహెచ్​సీలూ అర్హత పొందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి: రామకృష్ణాపురం కేరాఫ్ కూరగాయలు: టైమ్​పాస్ కోసం చేస్తే ఆరోగ్యం.. ఆదాయం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.