ETV Bharat / state

శ్రీశైలం విద్యుత్​ ప్రమాద మృతులకు నివాళులు అర్పించిన ఉద్యోగులు! - విద్యుత్​ ప్రమాదంలో మరణించిన వారికి నివాళి

శ్రీశైలం లెఫ్ట్​ పవర్​ హౌజ్​లో జరిగిన విద్యుత్​ ప్రమాదంలో దుర్మరణం పాలైన విద్యుత్​ ప్రమాద మృతులకు ప్రాజెక్టు చీఫ్​ ఇంజినీర్​ ప్రభాకర్​ రావు ఆధ్వర్యంలో ఉద్యోగులు నివాళులు అర్పించారు. జెన్కో కార్యాలయం ముందు విద్యుత్​ ప్రమాద మృతుల ఆత్మ శాంతించాలని మౌనం పాటించారు.

Jenco Staff pays tribute For Srishailam Accidents Deaths
శ్రీశైలం విద్యుత్​ ప్రమాద మృతులకు నివాళులు అర్పించిన ఉద్యోగులు!
author img

By

Published : Aug 23, 2020, 6:23 PM IST

మహబూబ్​నగర్​ జిల్లాలోని శ్రీశైలం లెప్ట్​ పవర్​ ఫ్లాంట్​లో జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైన విద్యుత్​ సిబ్బందికి ప్రాజెక్టు చీఫ్​ ఇంజినీర్​ ప్రభాక్​ రావు ఆధ్వర్యంలో శ్రీశైలం లెఫ్ట్​ పవర్​ ఫ్లాంట్​ సిబ్బంది నివాళులు అర్పించారు. జెన్కో కార్యాలయం ముందు మృతుల ఆత్మ శాంతించాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తమ తోటి ఉద్యోగుల మృతికి నివాళిగా విద్యుత్​ శక్తి కార్యాలయంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ దుర్ఘటన జరగడానికి గల కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెన్కో చీఫ్ ఇంజినీర్, డీఇలు, ఏఈలు, జెన్కో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.