స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల ముందంజలో ఉంది. ఉమ్మడి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్, 4 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయంతో పోలిస్తే జడ్చర్ల మొదటి స్థానంలో కొనసాగతోంది. 2019- 20 ప్రభుత్వ లక్ష్యం రూ.33 కోట్లు నిర్దేశించగా రూ. 48 కోట్ల ఆదాయం సమకూరింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత మూడేళ్లుగా... జడ్చర్లలో లక్ష్యాన్ని మించిన ఆదాయం వస్తోంది. కారణం 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలాలు ఈ కార్యాలయ పరిధిలో ఉండటం. పారిశ్రామికవాడ జిల్లాలో అనువైన ప్రదేశం కావడం వల్ల రియల్ వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి.
ఇటీవల కాలంలో 167 నెంబర్ జాతీయ రహదారి కూడా ఏర్పాటు కావడం... అందులో జడ్చర్ల, మిడ్జిల్ మండలాలు ఉండటం వల్ల ఇక్కడి ప్రాంతంలో కూడా రియల్ వ్యాపారం జోరందుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరుతోంది.
సంవత్సరం | లక్ష్యం | వచ్చిన ఆదాయం | శాతంలో |
2017_18 | 16 కోట్లు | 17 కోట్లు | 107 |
2018-19 | 20 కోట్లు | 41 కోట్లు | 209 |
2019-20 | 33 కోట్లు | 48 కోట్లు | 140 |