మానవాళి మనుగడకు ఎంతో కీలకమైన చెట్లను కాపాడేందుకు రైల్వే శాఖ తీసుకున్న చొరవ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్లో దాదాపు 50 నుంచి 100 సంవత్సరాల వయసు గల భారీ చెట్లు ఉన్నాయి. రైల్వే డబుల్ లైన్ కోసం స్టేషన్ పాత భవనంతో పాటు చెట్లను తొలగించాల్సి వస్తోంది. ఎలాగైనా చెట్లను కాపాడలనుకున్న రైల్వే శాఖ వాటిని అక్కడి నుంచి తొలగించి మరో స్థానంలో పెట్టేందుకు పనులను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
ఇవీ చూడండి: కర్తార్‌పుర్, కశ్మీర్ మధ్యవర్తిత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు