దేశం కోసం... దేశం మెచ్చేలా.. కేడెట్ టు ఆఫీసర్ - National Defense Academy examination 11th ranker Sanjay
సైన్యంలో చేరాలన్న తండ్రి కోరికను నెరవేర్చేందుకు సైనిక్ పాఠశాలలో చేరాడా కుర్రాడు. త్రివిధ దళాల్లో సేవలందించేందుకు ప్రతిక్షణం పరితపించిపోయాడు. ఆల్‌రౌండర్ కేడెట్‌గా... సౌత్ జోన్‌లోనే అత్యుత్తమ డిబేటర్‌గా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. తాజాగా విడుదలైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు... దక్షిణాదిలో మెుదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. చిన్న వయసులోనే ఆఫీసర్ ర్యాంక్ హోదా అందుకోబోతున్న ఆ కుర్రాడే... బైరెడ్డి సంజయ్ రెడ్డి. మెరైన్ కమాండో అవడమే తన ముందున్న లక్ష్యమంటున్న పాలమూరు యువతేజంతో ప్రత్యేక ముఖాముఖి.