మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌కు అడ్డు వచ్చిన ఘటనపై పాలనాధికారి విచారణకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ సీతారామారావును విచారణ అధికారిగా నియమించారు. భూమి కొనుగోలు చేసినప్పటి నుంచి తహశీల్దారు కార్యాలయం చుట్టు తిరిగినా ఎవరూ స్పందించలేదంటూ ఓ కుటుంబం సోమవారం మంత్రి వాహన శ్రేణిని అడ్డుకునేందుకు యత్నించారు.
వీరన్నపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకుని మంత్రి కేటీఆర్ తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరన్నపేట పాత రైల్వే గేటు దాటిన వెంటనే కుమ్మరివాడికి చెందిన శివశంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు.
మా సమస్య తీరుస్తారనే...
బాధిత కుటుంబ సమస్యపై సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలోని బండమీదిపల్లి శివారులో తొమ్మిదేళ్ల కిందట కొన్న ఎకరా భూమికి ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయలేదని బాధితులు చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులను అనేక పర్యాయాలు కలిసినా.. స్పందన కరవైందని వాపోయారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరేందుకే కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చామన్నారు.
ఇవీ చూడండి : తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నివాసంలో అఖిల పక్షం నేతల భేటీ